హాజరైన ఎమ్మెల్యే నాయిని, దాస్యం అభినవ్ భాస్కర్
వరంగల్ వాయిస్, హనుమకొండ : నగరంలోని ఆర్‌ఈసీ ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘యూనిటెడ్ హాక్ బ్రాండెడ్ మేన్స్ ఫ్యాషన్ షోరూమ్’ను ఆదివారం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తాజా మాజీ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ తో కలసి ముఖ్య అతిథులుగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. మహ్మద్ గౌస్ నిర్వహణలో ఈ షోరూమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ… హనుమకొండ నగరంలో యువతకు అనుగుణంగా యూనిటెడ్ హాక్ బ్రాండెడ్ మేన్స్ ఫ్యాషన్ షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమన్నారు. రాబోయే దసరా, దీపావళి పండుగల వేళ యువతకు సరికొత్త డిజైన్లు, నాణ్యమైన బ్రాండెడ్ వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని స్థానిక యువత సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం షోరూమ్ నిర్వాహకులు మహ్మద్ గౌస్ మాట్లాడుతూ… గత ఏడాది కాలంగా ప్రణాళికాబద్ధంగా పర్యవేక్షించి, ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే మొట్టమొదటిసారిగా ఈ షోరూమ్‌ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో అన్ని మండలాలు, జిల్లాలకు సేవలు విస్తరించేలా మరిన్ని షోరూమ్‌లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఆధునిక శైలికి తగ్గట్టుగా యువతతో పాటు పెద్దలకు కూడా సరిపోయే రకరకాల బ్రాండెడ్ దుస్తులు ఇక్కడ లభిస్తాయని తెలిపారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, నిర్వాహకుల బంధువులు, స్నేహితులు తదితరులు పాల్గొన్నారు.
