Sunday, August 16, 2026
HomeHanamkondaవరంగల్‌లో 'గుడ్ ఇయర్' కొత్త ఈగల్ ఎఫ్ 1 టైర్లు విడుదల

వరంగల్‌లో ‘గుడ్ ఇయర్’ కొత్త ఈగల్ ఎఫ్ 1 టైర్లు విడుదల

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రపంచ ప్రసిద్ధ ‘గుడ్ ఇయర్’ అమెరికా టైర్ల కంపెనీకి చెందిన అత్యున్నత నాణ్యత, హయ్యర్ పెర్ఫార్మెన్స్ కలిగిన కొత్త ‘ఈగల్ ఎఫ్ 1’ టైర్లను శనివారం వరంగల్ ఆఫీసర్స్ క్లబ్‌లో ఘనంగా మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి పీజీ గార్డెన్స్ అధినేత ప్రొద్దుటూరి రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా, విశ్రాంత ఆచార్యులు గడ్డం భాస్కర్ గౌరవ అతిథిగా హాజరయ్యారు. గుడ్ ఇయర్ ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రాంతీయ మేనేజర్ వడగ నాగరాజు, ‘శ్రీ తిరుమల టైర్స్’ యజమాని తాండ ప్రవీణ్ రామానుజన్ సమక్షంలో ఈ కొత్త టైర్లను మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కంపెనీ రీజినల్ మేనేజర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టైర్ల సాంకేతిక వివరాలను వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించిన ఈ ఈగల్ ఎఫ్ టైర్లు వాహన వినియోగదారులకు మైలేజ్ పరంగా ప్రయోజనం చేకూరుస్తాయి.మనదేశంలోని వివిధ రకాల రహదారులకు, వాహనాలకు అనుకూలంగా ఉంటూ సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తాయి. సుదీర్ఘ కాలం మన్నిక నిలిచేలా అత్యాధునిక సాంకేతికతతో ఇవి రూపుదిద్దుకున్నాయి.వినియోగదారులకు సకాలంలో నాణ్యమైన సేవలందిస్తూ, కంపెనీల నుంచి ఉత్తమ ప్రశంసలు పొందుతున్న ‘శ్రీ తిరుమల టైర్స్’ యజమాని తాండ ప్రవీణ్ రామానుజన్ సేవలను అతిథులు ఈ సందర్భంగా కొనియాడారు. శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామివారి ఆశీస్సులతో వ్యాపారాన్ని మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామాలయం అధ్యక్షులు కే. సాంబమూర్తి, బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు బైరి రవికృష్ణ గౌడ్, సత్యపాల్ రెడ్డి, మహేందర్ రెడ్డి, బొనగాని యాదగిరి గౌడ్, జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ గడ్డం కేశవమూర్తి, ధర్మసేతు గ్లోబల్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అరగంటి శ్రీకాంత్, పులి శ్రీకాంత్ గౌడ్, జోరిక రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular