వరంగల్ వాయిస్, దామెర: హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అర్థం రాజు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి మంగళవారం అర్థం రాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అర్థం రాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి తాను అండగా ఉంటానని, ఎలాంటి అవసరం వచ్చినా తనను సంప్రదించాలని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి రాజేందర్, బిక్షపతి, నాయకులు ప్రకాష్ రెడ్డి, రమణారెడ్డి, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
