Wednesday, June 17, 2026
Homejangamమండల బీఆర్‌ఎస్ సర్పంచుల ఫోరం ఎన్నిక

మండల బీఆర్‌ఎస్ సర్పంచుల ఫోరం ఎన్నిక

📰 Generate e-Paper Clip

అధ్యక్షుడిగా గైని శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా బొల్లం ఉమా రాణి

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సర్పంచుల ఫోరం నూతన కమిటీని మంగళవారం మండల కేంద్రంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్య ఆదేశాల మేరకు.. బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ముషిపట్ల విజయ్ ఆధ్వర్యంలో ఈ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. నూతన కమిటీలో అధ్యక్షుడిగా గైని శ్రీనివాస్ గౌడ్ (బానాజీపేట), ప్రధాన కార్యదర్శిగా బొల్లం ఉమా రాణి (రఘునాథపల్లి), ఉపాధ్యక్షులుగా కోర్ర స్వరూప రాజేందర్ నాయక్, పయ్యావుల రవి, కార్యదర్శిగా వెంకటేష్, కోశాధికారిగా ఇల్లందుల రవి, కమిటీ సభ్యులుగా శ్రీనివాస్, శగా కవిత, అశోక్, ఆరూరి సరిత, ఎడమ కోమలత, తోటకూర సదానందం, గోడిషాల లలిత తదితరులు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు గైని శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బొల్లం ఉమా రాణి మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ తాటికొండ రాజయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ, బీఆర్‌ఎస్ పార్టీని మండలంలో మరింత బలోపేతం చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యవంతులను చేస్తూ, పార్టీ ఆదేశాల మేరకు నిరంతరం శ్రమిస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

RELATED ARTICLES

Most Popular