Friday, July 24, 2026
HomeHanamkondaఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు ఫీజులు, వ్యాపారులకు గొడుగుల అందజేత

వరంగల్ వాయిస్, హనుమకొండ: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50వ జన్మదినాన్ని పురస్కరించుకుని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా హనుమకొండలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన ఈ కార్యక్రమాలలో బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు దుగ్గింపూడి రంజిత్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 52వ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు నాగరాజు ఆధ్వర్యంలో 50 మంది కార్యకర్తల పిల్లల పాఠశాల ఫీజుల నిమిత్తం రంజిత్ రెడ్డి చెక్కులను అందజేశారు. 29వ డివిజన్ నాయకుడు వడిచర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని చిరు వ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వడిచర్ల ప్రసాద్, నాగరాజు, జీవన్, శేఖర్, తస్లీమా, ఖాజా, గుడికందుల వినోద్ కుమార్, నరేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular