Wednesday, May 20, 2026
HomeHanamkondaతాళం వేసిన ఇల్లే టార్గెట్‌గా భారీ చోరీ

తాళం వేసిన ఇల్లే టార్గెట్‌గా భారీ చోరీ

📰 Generate e-Paper Clip

తులంన్నర బంగారం అపహరణ!

వరంగల్ వాయిస్, దామెర : మండల కేంద్రమైన దామెర గ్రామంలో బుధవారం ఓ ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చొరబడి భారీ చోరీకి పాల్పడ్డారు. బాధితుడు హింగే రవీందర్ కుటుంబంతో కలిసి ఊరికి వెళ్లిన సమయాన్ని ఆసరాగా చేసుకుని తులంన్నర (15 గ్రాముల) బంగారు నల్లపూసల తాడును అపహరించుకెళ్లారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దామెర గ్రామానికి చెందిన హింగే రవీందర్ (42) ఈ నెల 17న తన ఇంటికి తాళం వేసి, కుటుంబ సభ్యులతో కలిసి శిరిడీ యాత్రకు వెళ్లారు. బుధవారం (మే 20) మధ్యాహ్నం సుమారు 12 గంటల ప్రాంతంలో వారు తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఇంటి ప్రధాన ద్వారానికి వేసిన తాళం పగలగొట్టి ఉండటాన్ని చూసి వారు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. లోపలికి వెళ్లి చూడగా బెడ్‌రూమ్‌లోని బీరువా తాళాలు తీసి ఉన్నాయి. అందులో వెతకగా సుమారు తులంన్నర బరువు గల బంగారు నల్లపూసల తాడు కనిపించకుండా పోయింది. దొంగలు అత్యంత తెలివిగా తాము దొరికిపోకుండా ఉండేందుకు ఇంటికి ఉన్న సీసీ కెమెరాల వైర్లను కట్ చేసి ఈ చోరీకి పాల్పడినట్లు బాధితులు గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసి గుర్తుతెలియని దొంగలు లోపలికి చొరబడి బంగారాన్ని దొంగిలించారని బాధితుడు హింగే రవీందర్ దామెర పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దామెర ఎస్ఐ కేసు నమోదు చేశారు. విషయం తెలిసిన వెంటనే శాయంపేట రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి, దామెర ఎస్ఐతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వరంగల్ నుండి ప్రత్యేక క్లూస్ టీం రప్పించి, ఘటనా స్థలంలో వేలిముద్రలను సేకరించారు. దొంగలను త్వరలోనే పట్టుకుంటామని సీఐ సుధాకర్ రెడ్డి ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular