Thursday, May 28, 2026
HomeHanamkondaప్రతి బూత్ ఏజెంట్ సైనికుడిలా పనిచేయాలి

ప్రతి బూత్ ఏజెంట్ సైనికుడిలా పనిచేయాలి

📰 Generate e-Paper Clip

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి

వరంగల్ వాయిస్, హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్‌లో బూత్ ఏజెంట్లు ఒక సైనికుడిలా పనిచేస్తూ, బీఎల్ఓలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, 8వ డివిజన్ ఇన్‌చార్జి బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఒక్క అర్హమైన ఓటు కూడా మిస్ కాకుండా, అక్రమంగా తొలగించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు.. బుధవారం సాయంత్రం హన్మకొండ కమారపల్లిలో 8వ డివిజన్ బీఎల్ఏల ‘సర్’ అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా పట్టణ ప్రాంతం కావడంతో ఓటర్లు తరచూ ఇళ్లు మారడం, అద్దె ఇళ్లలో ఉండటం వల్ల ఓటరు జాబితాలో ఖచ్చితత్వం నిలుపుకోవడం సవాల్‌గా మారుతోందని ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. 2002 తర్వాత సుదీర్ఘ కాలానికి మళ్లీ ఇప్పుడు జరుగుతున్న ఈ సర్ ప్రక్రియను పార్టీ నాయకులు, బూత్ ఏజెంట్లు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. బిహార్, పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా లక్షలాది ఓట్లు తొలగించి అధికారంలోకి వచ్చిందని, తెలంగాణలోనూ అలాంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అందుకే రాబోయే మూడు నెలలు బీఎల్ఏలు, పార్టీ నాయకులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటర్లతో నేరుగా మాట్లాడి వివరాలు సేకరించాలి. ఇంటి యజమాని పేరు, ఫోన్ నంబర్‌ను తప్పనిసరిగా నమోదు చేయాలి. కుటుంబాల వారీగా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. కొత్తగా ఓటు హక్కు వచ్చే యువ ఓటర్ల గుర్తింపు, మారిన ఓటర్ల వివరాల సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బీఎల్ఓలతో కలిసి క్షేత్రస్థాయిలో తిరిగితేనే సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుంది. బూత్ స్థాయిలో ఒక్క చిన్న పొరపాటు జరిగినా ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని, బీఎల్ఓలు నిర్లక్ష్యం చేస్తే అర్హులైన ఓటర్లు జాబితా నుంచి తప్పిపోయే ప్రమాదం ఉందన్నారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ఇప్పటికే డివిజన్ల వారీగా ఇంచార్జిలను నియమించారని, రేపటి నుంచి బూత్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో సమన్వయం చేసుకుని క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో 8వ డివిజన్ అధ్యక్షులు మనోహర్ తక్కల్లపల్లి, డివిజన్ బీఎల్ఏలు, బూత్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES

Most Popular