వరంగల్ వాయిస్,హైదరాబాద్ : రాఖీ పండుగ పురస్కరించుకుని శుక్రవారం రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కి మంత్రి సీతక్క తో కలిసి అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టడం జరిగింది. ఈ సందర్బంగా మంత్రి కొండా సురేఖ ప్రపంచవ్యాప్తంగా రాఖీ పండుగను జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికీ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.ప్రతి సంవత్సరం కడుతున్నట్లే ఈ సంవత్సరం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తాను రాఖీ కట్టినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరుసగా మూడోసారి రాఖీ కట్టడం జరిగిందని, గత మూడు సంవత్సరాలుగా రాఖీ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కి, వారి మనవడికి కూడా రాఖీ కడుతున్నట్లు మంత్రి సురేఖ తెలిపారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై రాష్ట్రంలోని ఆడపడుచులందరి దీవెనలు, ఆశీస్సులు ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు, ప్రజలకు మంచి సుపరిపాలన అందించేందుకు ముఖ్యమంత్రి కి మరింత శక్తి, యుక్తి కలగాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీర్వాదాలు కూడా తెలంగాణలోని ఆడపడుచులందరిపై ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. తాను తెలంగాణ ఆడపడుచునని, తెలంగాణలోని ప్రతి కుటుంబం తనను వారి కుటుంబ సభ్యురాలిగా ఆదరిస్తుందని మంత్రి సురేఖ తెలిపారు. అందరి ఆడపడుచుల తరఫున ఈ రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
