వరంగల్ వాయిస్, వరంగల్ : వరంగల్ హంటర్ రోడ్డులో ఫాలుడా జ్యూస్ బండి వద్ద ఆదివారం రాత్రి మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న వాహనదారులను ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో వరంగల్ కమిషనరేట్ నిఘా విభాగం( ఇంటెలిజెన్స్ )కానిస్టేబుల్ శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉండటం తో హైదరాబాద్ ఓ ప్రవైట్ హాస్పిటల్ లో చేర్చడంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. దీంతో కుంటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు ఆందోళనకు గురయ్యారు. ప్రమాదానికి కారకులైన వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు.
