వరంగల్ వాయిస్, మామునూర్ : తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టిజిఎస్పీ ) 4వ బెటాలియన్ మామునూరు నూతన కమాండెంట్‌గా ఎన్.వి.ఎస్. శ్రీనివాసరావు శుక్రవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. బెటాలియన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో బెటాలియన్ ప్రస్తుత కమాండెంట్ డి. శివ ప్రసాద్ రెడ్డి నుండి ఆయన బాధ్యతల స్వీకరణ పత్రాలపై సంతకం చేశారు. ఈ సందర్భంగా బెటాలియన్ ఉన్నతాధికారులు, సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు.గతంలో గ్రేహౌండ్స్ విభాగంలో సుదీర్ఘ కాలం పనిచేసి, అత్యుత్తమ సేవలందించారు.ఈ సందర్భంగా నూతన కమాండెంట్ ఎన్.వి.ఎస్. శ్రీనివాసరావు మాట్లాడుతూ…రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో 4వ బెటాలియన్ ఎల్లప్పుడూ అగ్రభాగాన నిలుస్తుందని, సిబ్బందిని ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంచుతామని స్పష్టం చేశారు.పోలీస్ శాఖలో క్రమశిక్షణ, నిబద్ధత అత్యంత కీలకమని, విధుల్లో అలసత్వాన్ని సహించేది లేదని సిబ్బందిని ఆదేశించారు. బెటాలియన్‌లో పనిచేస్తున్న ప్రతి ఒక్క పోలీస్ అధికారి, జవాన్ల సంక్షేమానికి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ కమాండెంట్స్ కె.బాలయ్య,ఈ.వీరన్న, జె.రాజేందర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్స్ విజయ్, కార్తీక్, రాజిరెడ్డి,పురుషోత్తం రెడ్డి,వెంకటేశ్వర్లు, రాజ్ కుమార్, రాంప్రసాద్, ఆర్ఎస్ఐలు, మినిస్ట్రీయల్,యునిట్ మెడికల్ స్టాఫ్, సిబ్బంది పాల్గొన్నారు.
