వరంగల్ వాయిస్, దామెర: పరకాల నియోజకవర్గంలోని తక్కళ్లపహాడ్ గ్రామంలో అస్తవ్యస్తంగా మారిన రహదారులకు మోక్షం కల్పించాలని, సీసీ రోడ్లతో పాటు పటిష్టమైన డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ దాడి వసంత స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం ఆమె ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో ప్రధాన రహదారులు గుంతలమయంగా మారి రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని, ముఖ్యంగా వర్షాకాలంలో ప్రజలు బురదమయమైన దారులతో నానా అవస్థలు పడుతున్నారని ఆమె వివరించారు. ప్రజల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని తక్షణమే నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.గ్రామ కాలనీలు మరియు వీధుల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణం, ఆర్‌అండ్‌బీ రోడ్లకు అనుసంధానంగా డ్రైనేజీ పనుల చేపట్టడం. తక్కళ్లపహాడ్ ప్రాథమిక పాఠశాలలో కూలిపోయిన ప్రహరీ గోడను తిరిగి నిర్మించడం. విద్యార్థుల శారీరక, మానసిక వికాసం కోసం పాఠశాల ప్రాంగణంలో ఆటస్థలం, ఓపెన్ జిమ్ గ్రంథాలయం ఏర్పాటుకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. గ్రామ సర్వతోముఖాభివృద్ధి అత్యుత్తమ ప్రాధాన్యతనిచ్చి నిధులు మంజూరు చేయాలని సర్పంచ్ దాడి వసంత ఎమ్మెల్యేను కోరారు.
సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం ఎమ్మెల్యేకు వినతి
RELATED ARTICLES
