Sunday, September 20, 2026
HomeWarangalబిఆర్ ఎస్ నాయకులు దుగ్గింపూడి రంజిత్ రెడ్డి అరెస్ట్…

బిఆర్ ఎస్ నాయకులు దుగ్గింపూడి రంజిత్ రెడ్డి అరెస్ట్…

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, వరంగల్ :వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థుల ధర్నా కార్యక్రమానికి సంఘీభావం తెలపడానికి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసన సభ్యులు తన్నీరు హరీష్ రావు గురువారం వస్తున్న సందర్భంగా స్వాగతం పలకడానికి బారి ఎత్తున కార్యకర్తలు,యువకులతో బయలుదేరిన దుగ్గింపూడి రంజిత్ రెడ్డి ని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకొని మట్టేవాడ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది.రంజిత్ రెడ్డి ని అరెస్ట్ చేస్తుండగా పోలీసులకు బిఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర తోపులాట జరిగింది.అక్రమ అరెస్ట్ లను నిరసిస్తూ మట్టేవాడ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో దుగ్గింపూడి రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… విద్యార్థుల న్యాయమైన డిమాండ్లతో చేస్తున్న పోరాటానికి సంఘీభావం తెలపడానికి వస్తున్న మా నాయకులను,కార్యకర్తలను అరెస్ట్ చేయడం సిగ్గుచేటు అని పోలీసులను అడ్డుపెట్టుకొని ఈ ప్రభుత్వం పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, టీండి సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular