Wednesday, July 29, 2026
HomeHanamkondaజిల్లా స్థాయిలో డిస్నీల్యాండ్ విద్యార్థుల ప్రతిభ

జిల్లా స్థాయిలో డిస్నీల్యాండ్ విద్యార్థుల ప్రతిభ

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, హనుమకొండ : ప్రపంచ పులుల దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 26, 2026న హనుమకొండలో నిర్వహించిన వ్యాసరచన, చిత్రలేఖన పోటీలలో పూర్వపు వరంగల్ జిల్లా వ్యాప్తంగా డిస్నీల్యాండ్ హైస్కూల్ విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి బహుమతులు కైవసం చేసుకున్నారు. 10వ తరగతి విద్యార్థి ఉప్పుల శ్రీచరణ్ చిత్రలేఖన పోటీలలో పూర్వపు వరంగల్ జిల్లా స్థాయిలో ద్వితీయ బహుమతి సాధించగా, 8వ తరగతి విద్యార్థిని దయ్యాల లక్ష్మీప్రియ వ్యాసరచన పోటీలలో కన్సోలేషన్ బహుమతి అందుకుంది. విజేతలకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మరియు హనుమకొండ జిల్లా అటవీ శాఖ జిల్లా అధికారి ముకుంద రెడ్డి చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా పూర్వపు వరంగల్ జిల్లా స్థాయిలో ప్రతిభ చాటిన విద్యార్థులను పాఠశాల వ్యవస్థాపకులు దయ్యాల మల్లయ్య, దయ్యాల సదయ్య, బాలుగు లక్ష్మీనివాసం, కరస్పాండెంట్ శోభారాణి, డైరెక్టర్లు డి.రాకేష్ భాను, డి.దినేష్ చందర్ అభినందించారు. ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular