Thursday, September 24, 2026
HomeHanamkondaమహా మనిషి మండల రాములు కన్నుమూత

మహా మనిషి మండల రాములు కన్నుమూత

📰 Generate e-Paper Clip

నివాళులర్పించిన ప్రముఖులు

వరంగల్ వాయిస్, వరంగల్ : నగరంలోని రంగసాయిపేట ప్రాంతానికి చెందిన ప్రముఖ వృద్ధులు మండల రాములు (మండల పరుశరాములు, నరసింహారాములు తండ్రి) సోమవారం మృతి చెందారు. ఆయన మరణం స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి ఆశయాలకు అనుగుణంగా ఆయన కుమారులు మండల పరుశరాములు, నరసింహారాములు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. రాములు మరణించిన వెంటనే స్పందించి, ఆయన నేత్రదాన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మరణానంతరం కూడా మరొకరికి చూపునివ్వాలనే వారి నిర్ణయాన్ని స్థానికులు ప్రశంసించారు. మండల రాములు భౌతికకాయానికి పలువురు రాజకీయ, సామాజిక, ఉద్యోగ సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులర్పించిన వారిలో గుండు చందన పూర్ణచందర్ (42వ డివిజన్ మాజీ కార్పొరేటర్), కొల్లూరి యోగానంద్ (బీజేపీ రాష్ట్ర సాంస్కృతిక విభాగం ఇంచార్జి), కొంతం తారా మోహన్ (మాజీ కార్పొరేటర్), గాదే వేణుగోపాల్ (టీఎన్జీవోస్ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి), షేర్ల అనిల్ కుమార్ (దామరగుట్టల స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు), దామెరకొండ కరుణాకర్ (కాంగ్రెస్ పార్టీ నాయకులు), బొలిశెట్టి కమలాకర్ (రిటైర్డ్ వ్యాయామ ఉపాధ్యాయులు) ఉన్నారు. వీరితో పాటు కేడల పద్మ జనార్ధన్, నాయిని అశోక్, మిత్ర పరపతి సంఘం, జనతా పరపతి సంఘం కమిటీ సభ్యులు, పూర్వ మిత్ర పరపతి సంఘం కమిటీ సభ్యులు, బొలుగుడ్డు అనిల్ కుమార్, జీనుక రమేష్, విలాసాగరం శ్రీనివాస్, గుండు బాబురావు, గుండె కిరణ్ తదితరులు రాములు భౌతికకాయాన్ని సందర్శించి, వారి కుటుంబ సభ్యులకు తమ గాఢ సానుభూతిని తెలియజేశారు.

RELATED ARTICLES

Most Popular