Saturday, October 10, 2026
HomeHanamkondaఎస్ ఆర్ స్కూల్ లో బతుకమ్మ సంబరాలు

ఎస్ ఆర్ స్కూల్ లో బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

వరంగల్ వాయిస్, హనుమకొండ : గోపాల్ పూర్ లోని ఎస్ ఆర్ పాఠశాల యందు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ గాయని జేరిపోతుల సంధ్య ముఖ్య అతిథులుగా పాల్గొని పాఠశాల విద్యార్థులతో ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో జోనల్ ఇన్చార్జి రాజేశ్వర్ రెడ్డి, కోఆర్డినేటర్ సరితా రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు హిమబిందు మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియాలి అంటే ఇలాంటి పండుగ వేడుకలు విద్యార్థులకు తెలియాలన్నారు. అంతేకాక 10 రోజుల బతుకమ్మ వేడుకల ఆవశ్యకత దసరా వేడుకలను ఎందుకు జరుపుకుంటారో వారి ఉపన్యాసాల ద్వారా తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular