Sunday, September 13, 2026
HomeJangaonరేపే ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య భవనానికి భూమిపూజ

రేపే ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్య భవనానికి భూమిపూజ

📰 Generate e-Paper Clip

ముఖ్య అతిథిగా హాజరుకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
భారీగా తరలిరావాలని ఆర్యవైశ్య సంఘం పిలుపు

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : హైదరాబాద్‌లోని ఉప్పల్‌ భగాయత్‌లో ఆర్యవైశ్యుల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన 5 ఎకరాల స్థలంలో నిర్మించనున్న నూతన భవన నిర్మాణాలకు నేడు శంకుస్థాపన కార్యక్రమం వైభవంగా జరగనుంది. సెప్టెంబర్‌ 13 ఉదయం 10:30 గంటలకు ఈ భూమిపూజ మరియు ఫౌండేషన్‌ స్టోన్‌ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఈ చారిత్రక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ అధ్యక్షతన ఈ సభ జరగనుంది. శంకుస్థాపన అనంతరం శ్రీనివాస కల్యాణం, ఆత్మీయ సమ్మేళనం తదితర ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ చారిత్రక కార్యక్రమానికి జనగామ జిల్లా నుంచి ఆర్యవైశ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ వైస్‌ చైర్మన్‌, జనగామ జిల్లా ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు కూరెళ్ల పెద్ద ఉపేందర్‌ పిలుపునిచ్చారు. జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్‌కుమార్‌ ఆదేశాల మేరకు ఈ పిలుపునిచ్చినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యులు పోకల శివకుమార్‌, మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు తుమ్మలపల్లి సోమేశ్వర్‌, బచ్చు చిరంజీవి, ఓరుగంటి శంకర్‌లింగం, కూరెళ్ల చిన్న ఉపేందర్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని పలువురు ప్రముఖులు, సంఘం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.

RELATED ARTICLES

Most Popular