అండగా ఉంటామని భరోసా ఇచ్చిన మాజీ మంత్రి
వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్టు, బీసీ రాజ్యాధికార సమితి జనగామ జిల్లా ప్రచార కార్యదర్శి చింతకింది కృష్ణమూర్తి తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయమై సోమవారం మధ్యాహ్నం మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య జర్నలిస్టు కృష్ణమూర్తి నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. గత మూడు దశాబ్దాలుగా జర్నలిస్టుగా సమాజానికి సేవనందిస్తున్న కృష్ణమూర్తి కుటుంబానికి పార్టీ పరంగా, వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ అండగా ఉంటామని రాజయ్య భరోసా కల్పించారు .ఈ కార్యక్రమంలో మండల బీఆర్ఎస్ కన్వీనర్, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ మున్సిపట్ల విజయ్, రఘునాథపల్లి సర్పంచ్ బొల్లం ఉమారాణి రాజీవ్, కవాటి రాజయ్య, జర్నలిస్టు కృష్ణమూర్తి, రాజేశ్వరి దంపతులు మరియు వారి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
