Saturday, April 18, 2026
HomeJangaonబాటసారుల దాహార్తిని తీర్చడం అభినందనీయం

బాటసారుల దాహార్తిని తీర్చడం అభినందనీయం

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సీ పోచంపల్లి

వరంగల్ వాయిస్, రఘునాథపల్లి : వేసవి ఎండల తీవ్రత దృష్ట్యా ప్రయాణికులు, బాటసారుల సౌకర్యార్థం చలివేంద్రాలను ఏర్పాటు చేయడం గొప్ప విషయమని వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఆశాల టోల్‌గేట్ సమీపంలో, మాజీ ఎంపీపీ స్వర్గీయ బొల్లం బిక్షపతి స్మారకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని జనగామ జిల్లా మాజీ జడ్పీటీసీల ఫోరం అధ్యక్షులు బొల్లం అజయ్ మణికంఠతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. మాజీ ఎంపీపీ భిక్షపతి అందించిన సేవలు చిరస్మరణీయమని, వారి జ్ఞాపకార్థం ప్రజలకు ఉపయోగపడేలా చలివేంద్రాన్ని ఏర్పాటు చేసిన బొల్లం కుటుంబాన్ని అభినందించారు. బొల్లం అజయ్ మణికంఠ మాట్లాడుతూ.. ప్రతిరోజూ ఎండల తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రయాణికుల కోసం ఈ తాగునీటి సౌకర్యాన్ని కల్పించామని, త్వరలో భిక్షపతి పేరుతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ముసుపట్ల విజయ్, మండల యూత్ అధ్యక్షులు దుబ్బాక హరీష్ గౌడ్, వెల్ది ఉపసర్పంచ్ ఎడ్ల బాలరాజ్, బాల్నే పరుశురాం, పేర్ని ప్రసాద్, పేర్ని లెనిన్, కరీంకొండ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular