Tuesday, April 28, 2026
HomeWarangalవిధి నిర్వహణలో ప్రతిభ

విధి నిర్వహణలో ప్రతిభ

📰 Generate e-Paper Clip

సీఐ విశ్వేశ్వర్‌కు సీపీ ప్రశంసలు

వరంగల్ వాయిస్, గీసుగొండ : తన విధుల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన గీసుగొండ సీఐ డి.విశ్వేశ్వర్ ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో నిర్వహించిన క్రైమ్ రివ్యూ సమావేశంలో, వరంగల్ పోలీస్ కమిషనర్ సున్‌ప్రీత్ సింగ్ చేతుల మీదుగా ఆయన ప్రశంసా పత్రాన్ని, నగదు పురస్కారాన్ని స్వీకరించారు. గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిషేధిత పొగాకు ఉత్పత్తులైన గుట్కా, తంబాకు విక్రయాలపై సీఐ విశ్వేశ్వర్ కఠిన చర్యలు తీసుకున్నారు. అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టడంలో ఆయన చూపిన చొరవను సీపీ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు, చిన్నపిల్లలు వ్యసనాల బారిన పడకుండా సీఐ చేపట్టిన ముందస్తు నిఘా చర్యలు ఫలించాయి. నిషేధిత ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంలో సీఐ కీలక పాత్ర పోషించారు. సీఐ విశ్వేశ్వర్ కనబరుస్తున్న క్రమశిక్షణ, అంకితభావం తోటి అధికారులకు స్ఫూర్తిదాయకమని సీపీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఇతర ఉన్నతాధికారులు పాల్గొని సీఐ విశ్వేశ్వర్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఈ గుర్తింపు తన బాధ్యతను మరింత పెంచిందని, ప్రజల భద్రత కోసం మరింత కష్టపడతానని ఈ సందర్భంగా సీఐ పేర్కొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular